రాజమండ్రి కేంద్ర కారాగారానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:51 AM
స్థానిక ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్సుల అపహరణకు యత్నించారనే కేసులో అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి...
గుంటూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్సుల అపహరణకు యత్నించారనే కేసులో అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. జైలు అధికారులు, పోలీసులు... ‘అప్పిరెడ్డి కోరిన ప్రత్యేక సదుపాయాలు గుంటూరు జిల్లా జైలులో అందుబాటులో లేవు. జైలు వద్ద భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి’ అని నివేదికలు సమర్పించారు. వాటిని పరిశీలించిన గుంటూరు కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారం రాత్రి పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు