Share News

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి బెయిల్‌

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:10 AM

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి హైకోర్టులో ఉపశమనం లభించింది. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి, సుచిత్ర అనే మహిళతో అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారంలో విరూపాక్షితోపాటు ఆయన అనుచరులు...

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి బెయిల్‌

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి హైకోర్టులో ఉపశమనం లభించింది. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి, సుచిత్ర అనే మహిళతో అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారంలో విరూపాక్షితోపాటు ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు 40 మందికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు గురువారం తీర్పు ఇచ్చారు. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 05:10 AM