Share News

ఓటుకు మటన్‌ తాయిలం

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:25 AM

ఓటు కోసం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని ఓ వైసీపీ నేత వినూత్నంగా ఆలోచించారు. ఓటుకు నోటుతోపాటు మటన్‌ పంపిణీ చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఓటుకు మటన్‌ తాయిలం

  • వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పొట్టేళ్లు స్వాధీనం

చీమకుర్తి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఓటు కోసం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని ఓ వైసీపీ నేత వినూత్నంగా ఆలోచించారు. ఓటుకు నోటుతోపాటు మటన్‌ పంపిణీ చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బుధవారం చీమకుర్తి మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామంలో చోటుచేసుకున్న ఘటన వివరాలను సీఐ దాసరి ప్రసాద్‌ తెలిపారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్నపురెడ్డి రమణారెడ్డి ఎంపీటీసీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలనుకున్నారు.

30 కేజీల బరువు ఉండే 20 పొట్టేళ్లను దాదాపు రూ.6 లక్షలకు కొనుగోలు చేశాడు. గ్రామంలో ఉన్న 600 ఇళ్లకు ఇంటికి ఒక కేజీ చొప్పును ఇవ్వడానికి వాటిని కటింగ్‌ చేసి పంపిణీని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న చీమకుర్తి సీఐ సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకుని పంపిణీని అడ్డుకున్నారు. రమణారెడ్డిని అదుపులోకి తీసుకొని, పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 04:26 AM