వైసీపీ నిరసనలో.. కూలీలు..
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:23 AM
మెగా డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు సోమవారం చేపట్టిన నిరసనల్లో అసలైన అభ్యర్థులు ఒక్కరూ కనిపించలేదు. చాలా ప్రాంతాల్లో డీఎస్సీతో సంబంధం లేని ఇంటర్ విద్యార్థులను, వలస కూలీలను రంగంలోకి దింపి... వారంతా డీఎస్సీ అభ్యర్థులేనన్నట్టుగా వైసీపీ నేతలు కలరింగ్ ఇచ్చారు.
వైసీపీ ఆందోళనల్లో ఇంటర్ విద్యార్థులు కూడా..
కనిపించిన డీఎస్సీ అభ్యర్థులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): మెగా డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు సోమవారం చేపట్టిన నిరసనల్లో అసలైన అభ్యర్థులు ఒక్కరూ కనిపించలేదు. చాలా ప్రాంతాల్లో డీఎస్సీతో సంబంధం లేని ఇంటర్ విద్యార్థులను, వలస కూలీలను రంగంలోకి దింపి... వారంతా డీఎస్సీ అభ్యర్థులేనన్నట్టుగా వైసీపీ నేతలు కలరింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో చేపట్టిన నిరసన ర్యాలీల్లో ఉత్తరాది రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీలకు రూ.300 చొప్పున ఇచ్చి ర్యాలీకి రప్పించారు. ర్యాలీలో కొంతమేరకు పార్టీ కార్యకర్తలు, ఎక్కువ శాతం ప్రలోభాలతో రప్పించిన వారే కనిపించారు.
ఎక్కడా డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత కనిపించలేదు. మరోవైపు వైసీపీ ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తారనే సాకుతో నేతలు సొంతంగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిలో కొందరు పోలీసు యూనిఫాంను పోలిన దుస్తులు ధరించి వాకీటాకీలతో కనిపించారు. సూళ్లూరుపేటలో చేపట్టిన ర్యాలీలో ఇంటర్ విద్యార్థులు కనిపించారు. ఓ ప్రైవేటు కళాశాల నుంచి ఇంటర్ విద్యార్థులను ర్యాలీకి రప్పించారు. రైల్వే కోడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతిల్లో జరిగిన వైసీపీ ర్యాలీల్లో ఎక్కడా డీఎస్సీ అభ్యర్థులు కనిపించలేదు.
చిక్కుకుపోయిన మహిళా ఏఎస్ఐ
చిత్తూరు జిల్లా పూతలపట్టులో అంబేడ్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ ఇన్‌చార్జి సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు సూచిస్తూ బారికేడ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. దూసుకువచ్చిన వైసీపీ శ్రేణులు.. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న మహిళా ఏఎ్‌సఐ కిందపడిపోయారు. వైసీపీ కార్యకర్తలు ఆమెపై నుంచి వెళ్లడంతో ఏఎ్‌సఐ అస్వస్థతకు గురయ్యారు. చిత్తూరులో వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. జీడీ నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో పాటు పలువురిని అడ్డుకున్నారు.
తాడిపత్రిలో పోటా పోటీ!
డీఎస్సీపై నిరసనకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు యత్నించగా ముచ్చుకోట వద్ద పోలీసులు అడ్డగించారు. దీంతో పెద్దిరెడ్డి, అనంత వెంకటరామిరెడి రోడ్డుపైనే బైఠాయించారు. వైసీపీ నేతల ఆందోళనకు దీటుగా స్పందించేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు. ఆయననూ పోలీసులు అడ్డుకున్నారు.
ఇవి కూడా చదవండి
నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు