Share News

నా డబ్బులు ఇచ్చేయండి

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:23 AM

‘నా వద్ద డబ్బు తీసుకుని ఓటేయని వాళ్లంతా మర్యాదగా తిరిగి ఇచ్చేయండి’ అని చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్‌ ఎన్నికల్లో 32వ వార్డుకు వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన ప్రసాద్‌ కోరారు. ఈమేరకు ఆయన సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో వైరల్‌ అవుతోంది.

నా డబ్బులు ఇచ్చేయండి

  • లేదంటే మీ ఇళ్ల ముందు ఆందోళన చేస్తా

  • పలమనేరు వైసీపీ అభ్యర్థి ప్రసాద్‌ హెచ్చరిక

‘నా వద్ద డబ్బు తీసుకుని ఓటేయని వాళ్లంతా మర్యాదగా తిరిగి ఇచ్చేయండి’ అని చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్‌ ఎన్నికల్లో 32వ వార్డుకు వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన ప్రసాద్‌ కోరారు. ఈమేరకు ఆయన సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో వైరల్‌ అవుతోంది. ‘రూ.10 లక్షలు వడ్డీకి తెచ్చి, ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున ఇచ్చాను. మారెమ్మగుడి ప్రాంత మహిళలు నాకే ఓటు వేస్తామని.. అమ్మవారిపై ఒట్టేసి మరీ డబ్బు తీసుకున్నారు. నా వద్ద డబ్బు తీసుకుని ఓటేయని వాళ్లంతా మర్యాదగా డబ్బు తిరిగి ఇచ్చేయండి. లేదంటే మీ ఇళ్ల వద్ద ఆందోళన చేస్తా. మీరు డబ్బు తిరిగి ఇచ్చేస్తే.. నేను హామీ ఇచ్చిన మేరకు వాటర్‌ ప్లాంటు పెట్టిస్తా’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. కొసమెరుపు ఏమంటే.. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ అతడిని బుధవారం వైసీపీ నుంచి బహిష్కరించారు.

- పలమనేరు, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:23 AM