Share News

బావమరిది మెడ కొరికాడు!

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:38 AM

ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశాడన్న కోపంతో సొంత బావమరిదిపై వైసీపీ అభ్యర్థి దాడిచేశాడు. అతడి మెడ కొరికి తీవ్రంగా గాయపరిచాడు.

బావమరిది మెడ కొరికాడు!

  • అనంతపురం జిల్లా యాడికిలో ఘటన

యాడికి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశాడన్న కోపంతో సొంత బావమరిదిపై వైసీపీ అభ్యర్థి దాడిచేశాడు. అతడి మెడ కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువులో శుక్రవారం జరిగింది. రాయలచెరువు ఎంపీటీసీ-1 స్థానానికి వైసీపీ తరఫున మాదాల జనార్దన్‌ బరి లో దిగారు. ఆయన బావమరిది మోటుపల్లి రవి సహా బంధువులందరూ వైసీపీకి కాకుండా, టీడీపీతరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వారిపై జనార్దన్‌ అక్కసు పెంచుకున్నాడు.

పోలింగ్‌ పూర్తయినప్పటి నుంచి పగతో రగిలిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పట్టణంలోని మెడికల్‌ స్టోర్‌ వద్ద తన బంధువుల్లో ఒకరైన మోటుపల్లి మనోహర్‌ కనిపించగా.. జనార్దన్‌ దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఆయన సొంత బావమరిది మోటుపల్లి రవి అడ్డుకోవడంతో అతడిపై దాడికి దిగాడు. బావమరిది మెడ కొరికి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు అతడిని పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. రవికి ఆరుకుట్లు పడ్డాయి. జనార్దన్‌ పారిపోయి ఒక కాంప్లెక్స్‌లో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న రవి బంధువులు, మద్దతుదారులు అక్కడికి వెళ్లి జనార్దన్‌ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 05:42 AM