ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:33 AM
బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలుచేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ గుంటూరు రెండో అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజ తీర్పు చెప్పారు.
గుంటూరు(లీగల్), నవంబరు 25(ఆంధ్రజ్యోతి): బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలుచేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ గుంటూరు రెండో అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజ తీర్పు చెప్పారు. పరిషత్ ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా వెంగళాయపాలెం ఎన్నికకు సంబంధించి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను, బ్యాలట్ బాక్స్‌లను అడ్డగించి బెదిరించిన కేసులో అప్పిరెడ్డి అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలని అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గత శుక్రవారం వాదోపవాదాలు ముగిశాయి. ప్రాసిక్యూషన్ తరపున ఇన్చార్జి ప్రాసిక్యూషన్ డైరెక్టర్ బైరా రామకోటేశ్వరరావు వాదనలు వినిపించగా, అప్పిరెడ్డి తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ బుధవారం తీర్పు చెప్పింది.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్