అమ్మానాన్నల ఆశీస్సులతో అంజలి పెళ్లి
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:07 AM
తన కుమార్తె వివాహ వేడుకలు వైభవంగా జరిగాయంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గురువారం ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.
కుమార్తె వివాహ వేడుకపై షర్మిల శుభాకాంక్షలు
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తన కుమార్తె వివాహ వేడుకలు వైభవంగా జరిగాయంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గురువారం ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ‘నాన్న వైఎస్‌ఆర్ దీవెనలు.. అమ్మ ఆశీస్సుల మధ్య, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో నా బిడ్డ అంజలీరెడ్డి - సోమల రఘురామ్‌రెడ్డి వివాహ వేడుక కనుల పండువగా జరిగింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అంజలీ-రఘులకు ఆ దేవుని శుభాశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
షర్మిల కుమార్తెకు లోకేశ్ శుభాకాంక్షలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలీ రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి దంపతులకు టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం అంజలీ, రఘురామ్ వివాహవేడుక కన్నులపండుగగా జరిగిందని వైఎస్ షర్మిల ఎక్స్‌లో చేసిన పోస్టుపై లోకేశ్ స్పందించారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న జంట ప్రేమ, ఆనందం, అన్యోన్యతతో కలకాలం కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంతోషకరమైన సందర్భంలో షర్మిలకు, ఆమె కుటుంబ సభ్యులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా