Share News

బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన అప్పిరెడ్డి

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:11 AM

బ్యాలెట్‌ బాక్సుల అపహరణ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన అప్పిరెడ్డి

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): బ్యాలెట్‌ బాక్సుల అపహరణ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగినప్పుడు తాను అక్కడ లేనని, ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు, రిమాండ్‌ రిపోర్ట్‌లోని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘నేను శాంతియుతంగా నిరసన మాత్రమే తెలిపాను. ఇప్పటికే పోలీస్‌ కస్టడీ ముగిసింది. కేసులో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, పోలీసుల వాంగ్మూలాలు నమోదు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసిందున నిర్బంధించాల్సిన అవసరం లేదు. నాది 60ఏళ్ల వయసు. మధుమేహం, బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటాను. పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేస్తాను. బెయిల్‌ మంజూరు చేయండి’ అని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో అప్పిరెడ్డికి బెయిల్‌ నిరాకరిస్తూ గుంటూరు రెండవ అదనపు జిల్లా జడ్జి ఈ నెల 25న ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 02:13 AM