యనమలకు అస్వస్థత.. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:12 AM
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పితో గురువారం ఉదయం కాకినాడ కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో చేరారు. యాంజియోగ్రామ్ పరీక్షలో గతంలో అమర్చిన స్టంట్‌లో రక్తం..
తుని రూరల్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పితో గురువారం ఉదయం కాకినాడ కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో చేరారు. యాంజియోగ్రామ్ పరీక్షలో గతంలో అమర్చిన స్టంట్‌లో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించిన వైద్యులు బెలూన్ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. కార్డియాలజిస్టులు డాక్టర్ నిశాంత్, డాక్టర్ పవన్‌కుమార్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ ఎస్.రామకృష్ణ పర్యవేక్షణలో చికిత్స జరిగింది. యనమల ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ యనమల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యనమలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఎంపీ సానా సతీశ్‌ను, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎంపీ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. యనమల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి లోకేశ్ ఆరా తీశారు. తుని టీడీపీ నాయకుడు యనమల రాజేశ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి: