Share News

హార్టికల్చర్‌ హబ్‌కు ప్రపంచ బ్యాంక్‌ అభినందన

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:17 AM

రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటు నేపథ్యంలో ప్రపంచబ్యాంక్‌ బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ హబ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలను సమీక్షిస్తోంది.

హార్టికల్చర్‌ హబ్‌కు ప్రపంచ బ్యాంక్‌ అభినందన

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటు నేపథ్యంలో ప్రపంచబ్యాంక్‌ బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ హబ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలను సమీక్షిస్తోంది. ఈ సందర్భంగా రూ.లక్ష కోట్ల వ్యయం అంచనాతో చేపట్టే ఈ ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేస్తున్న విభాగం పనితీరును అభినందించింది. బుధవారం వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, డైరెక్టర్‌ శ్రీనివాసులుతో బృందం సమావేశమై, ప్రాజెక్టు ప్రణాళికపై చర్చించింది. డిసెంబరు 3వరకు పర్యటించనున్న ఈ బృందం క్షేత్రస్థాయిలో ఉద్యాన తోటలు, పండ్ల ఉత్పత్తి, మార్కెటింగ్‌ సౌకర్యాలు, ఎగుమతులు వంటి అంశాలను పరిశీలిస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 04:29 AM