Share News

కుమార్తె మేయర్‌.. తల్లి కార్పొరేటర్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:20 AM

కర్నూలు కార్పొరేషన్‌, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారంలో ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి.

కుమార్తె మేయర్‌..  తల్లి కార్పొరేటర్‌

  • భార్య చైర్‌పర్సన్‌.. భర్త కౌన్సిలర్‌

  • కర్నూలు జిల్లాలో ఆసక్తికరంగా ప్రమాణ స్వీకారాలు

కర్నూలు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు కార్పొరేషన్‌, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారంలో ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. కర్నూలు మేయర్‌గా బొల్లెద్దుల విజయ ప్రత్యూష ప్రమాణ స్వీకారం చేయగా, ఆమె తల్లి బొల్లెద్దుల సరస్వతమ్మ 68వ వార్డు కార్పొరేటర్‌గా ప్రమాణం చేశారు. మేయర్‌గా విజయ ప్రత్యూష ప్రమాణస్వీకారానికి వెళ్తున్న సమయంలో కుర్చీలో కూర్చున్న తల్లికి పాదాభివందనం చేశారు. తన కుమార్తెను ఆ తల్లి ఆనందబాష్పాలతో ఆశీర్వదించారు.

ఇక ఎమ్మిగనూరు చైర్‌పర్సన్‌గా మాచాని సునీత ప్రమాణస్వీకారం చేయగా, ఆమె భర్త మాచాని మహేశ్‌ 37వ వార్డు కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కర్నూలులో కూతురు, తల్లీ.. ఎమ్మిగనూరులో భార్య, భర్త ఇలా పదవులు చేపట్టడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బీవీ జయనాగేశ్వరరెడ్డి హాజరయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 06:26 AM