Share News

మ్యాజిక్‌ డ్రెయిన్స్‌ అద్భుతం

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:59 AM

వీబీ జీఆర్‌జీ పథకం(ఉపాధి హామీ) పనులపై పశ్చిమ బెంగాల్‌ బృందం అధ్యయనం చేస్తోంది. క్షేత్రస్థాయి పర్యటనకు ముందు శుక్రవారం ఉదయం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పీఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్‌ కృష్ణతేజతో ఈ బృందం భేటీ అయ్యింది.

మ్యాజిక్‌ డ్రెయిన్స్‌ అద్భుతం

  • జీరామ్‌జీ పనులపై పశ్చిమ బెంగాల్‌ బృందం అధ్యయనం

అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): వీబీ జీఆర్‌జీ పథకం(ఉపాధి హామీ) పనులపై పశ్చిమ బెంగాల్‌ బృందం అధ్యయనం చేస్తోంది. క్షేత్రస్థాయి పర్యటనకు ముందు శుక్రవారం ఉదయం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పీఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్‌ కృష్ణతేజతో ఈ బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కృష్ణతేజ వారికి జీరామ్‌జీలో చేపడుతున్న పనులను, అవలంబిస్తున్న విధానాలను వివరించారు.

అనంతరం ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ రూరల్‌, నందిగామ మండలాల్లోని కె.తాడేపల్లి, పాతపాడు, నున్న గ్రామాల్లో ఈ పథకంలో చేపట్టిన సరిహద్దు కందకాలు, ఖండిత కందకాలు, ఉద్యానవన పంటల అభివృద్ధి, ఫారంపాండ్‌, గోకులాలు పరిశీలించారు. అలాగే ‘సోమవరం’లో నిర్మించిన మ్యాజిక్‌ డ్రెయిన్‌ నిర్మాణాలు, మునగచర్లలోని కమ్యూనిటీ క్యాటిల్‌ షెడ్‌, ఉద్యాన పంటలు సందర్శించారు. ఏపీ పీఆర్‌ అండ్‌ ఆర్డీ జేసీ జె.సునీత నేతృత్వంలో ఈ క్షేత్ర పర్యటన జరిగింది.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 05:59 AM