19 నుంచి డబ్ల్యూఏపీఎల్
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:11 AM
ఏసీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డబ్ల్యూఏపీఎల్‌ను నారా బ్రాహ్మణి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. బుధవారం విజయవాడలోని ఏసీఏ భవనంలో ఎంపీ చిన్ని మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి 27 వరకు డబ్ల్యూఏపీఎల్ పోటీలు జరగనున్నాయన్నారు.
ప్రారంభించనున్న నారా బ్రాహ్మణి
ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
విజయవాడ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏసీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డబ్ల్యూఏపీఎల్‌ను నారా బ్రాహ్మణి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. బుధవారం విజయవాడలోని ఏసీఏ భవనంలో ఎంపీ చిన్ని మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి 27 వరకు డబ్ల్యూఏపీఎల్ పోటీలు జరగనున్నాయన్నారు. పురుష క్రికెటర్లతో సమాన ప్రాధాన్యం మహిళా క్రికెటర్లకు కల్పించాలన్నదే ఏసీఏ విధానమని తెలిపారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను రోజుకు ఒకరిని ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్టు ఆయన చెప్పారు. మహిళా క్రికెట్‌పై అవగాహన పెంచేందుకు విజయవాడ నుంచి మంగళగిరి వరకు మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం అందించడంతో పాటు, ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక కల్పించడమే టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్‌లో నాలుగు జట్లు పోటీ పడుతున్నాయని, ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లను మంగళగిరి స్టేడియంలోనే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు ఎంపీ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య