2007లో భార్య మృతి.. 2026లో భర్తకు శిక్ష
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:13 AM
వరకట్న వేధింపుల వల్ల భార్య మృతిచెందిన కేసులో దాదాపు 19 సంవత్సరాల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం భర్తకు శిక్ష పడింది.
విశాఖపట్నం లీగల్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): వరకట్న వేధింపుల వల్ల భార్య మృతిచెందిన కేసులో దాదాపు 19 సంవత్సరాల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం భర్తకు శిక్ష పడింది. భర్తను దోషిగా నిర్ధారించిన విశాఖ ఆరో అదనపు జిల్లా మహిళా కోర్టు న్యాయమూర్తి ఎస్.దామోదరరావు అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.17 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. నగరంలోని మల్కాపురం క్రాంతినగర్‌కు చెందిన ముత్యాల వెంకటరమణ కుమార్తె మణిమాలకు, చినవాల్తేర్ ఈస్టుపాయింట్ కాలనీకి చెందిన అనిల్‌కుమార్‌తో 2005 డిసెంబరు 14న వివాహమైంది.
2006 జనవరి 13న ఉద్యోగరీత్యా అనిల్‌కుమార్ బహ్రెయిన్ వెళ్లాడు. మణిమాల కూడా 2007 మార్చి 2న బహ్రెయిన్ వెళ్లింది. కానీ, అక్కడకు వెళ్లిన నెల రోజులకే (ఏప్రిల్ 8న) ఆమె మృతిచెందింది. కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మణిమాల తండ్రి వెంకటరమణ మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణిమాలను కట్నం కోసం అనిల్‌కుమార్, అతడి తండ్రి సూరిబాబు, తల్లి వెంకటరత్నం వేధించినట్టు పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం అనిల్‌కుమార్‌ను న్యాయమూర్తి దోషిగా నిర్ధారించారు.
ఈ వార్తలనూ చదవండి: