సీఎం సహాయ నిధికి ‘వీఐటీ’ రూ.కోటి విరాళం
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:07 AM
ముఖ్యమంత్రి సహాయ నిధికి అమరావతిలోని వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) రూ.కోటి విరాళాన్ని అందజేసింది.
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధికి అమరావతిలోని వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) రూ.కోటి విరాళాన్ని అందజేసింది. విఐటి చైర్మన్ జి.విశ్వనాథన్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి, ఈ విరాళాన్ని అందజేశారు. అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, బాధితులకు సహకారం అందించేలా విట్ సంస్థ ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు విశ్వనాథన్ తెలిపారు. విరాళం ఇచ్చిన విట్ ప్రతినిధులను సీఎం అభినందించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్