తానా సేవా కార్యక్రమం.. విద్యార్థులకు హోంవర్క్ డైరీల పంపిణీ
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:46 PM
విద్యార్థుల్లో క్రమశిక్షణ, చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరో ముందడుగు వేసింది. తానా ఆధ్వర్యంలో తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు హోంవర్క్ డైరీలను పంపిణీ చేశారు.
అనకాపల్లి జిల్లా: దేవరాపల్లి మండలం తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో SATVIINSPIRE ఫౌండేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు హోంవర్క్ డైరీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చి. శ్రీచరణి మేకా స్పాన్సర్ చేయగా, తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ చౌదరి మేకా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, హోంవర్క్ డైరీలు విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు రోజూ చేసే హోంవర్క్, పాఠశాల కార్యకలాపాలు, చదువులో సాధిస్తున్న పురోగతిని తల్లిదండ్రులు సులభంగా తెలుసుకునేందుకు ఇవి దోహదపడతాయని చెప్పారు. అలాగే విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన వైఖరిని పెంపొందించడంతో పాటు, పాఠశాల-తల్లిదండ్రుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ డైరీలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ఎస్.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని హోంవర్క్ డైరీల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా, తానా ఫౌండేషన్ సభ్యులు, SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ పెద్దాడ వెంకటరమణ, శ్రీనివాసరావు, మహేశ్వరరావు, కొండమ్మ, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, అలాగే తానా న్యూజెర్సీ బృందం మార్గదర్శకత్వం, సహకారం అందించారు.

ఈ సందర్భంగా SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల విద్యా ప్రగతికి తోడ్పడే ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
Also Read:
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మరోసారి హైకోర్టు నోటీసులు
ముంబైలో కనువిందు చేసిన జంట ఇంద్రధనస్సులు.. వీడియో వైరల్