వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియో.. స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..
ABN , Publish Date - Jun 07 , 2026 | 01:40 PM
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు.
అమరావతి, జూన్ 7: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. 'సత్యనారాయణ గారు.. రేపు సిద్ధాంతంలో కలుద్దాం' అని రాసుకొచ్చారు. ఇంతకీ సంగతేంటంటే.. కామధేనువులంకకు చెందిన వృద్ధుడు సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలనుకున్నారు. ఆ వృద్ధుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంత అభిమానం ఉందో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు ‘చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా చూశావా?’ అని వృద్ధుడు సత్యనారాయణను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సత్యనారాయణ సమాధానం ఇస్తూ.. ‘హైదరాబాద్ వెళితే కనపడతాడు అంటారు. కానీ, కనిపించడు’ అని అన్నాడు. అప్పుడు ఆ యువకుడు..‘ఇప్పుడేంటి.. నువ్వు చంద్రబాబు గారిని చూడాలా?’ అని అడిగాడు. సత్యనారాయణ అవునని సమాధానం ఇచ్చాడు.
9వ తేదీన సీఎం చంద్రబాబు సిద్ధాంతం వస్తున్నారని, అక్కడ ఆయనను కలుద్దామని యువకుడు సత్యనారాయణకు చెప్పాడు. ఆయన ఎంతో సంతోషించాడు. ఎలాగైనా సరే ముఖ్యమంత్రిని కలిసి తీరదాం అని తేల్చి చెప్పాడు. యువకుడు దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సత్యనారాయణను కలుస్తానని మాటిచ్చారు.
ఇవి కూడా చదవండి
టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?
రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ! 11న కీలక ప్రకటన