జీఆర్‌ఎంబీ చైర్మన్‌గా వినీత్ గుప్తా
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:53 AM
గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌గా వినీత్ గుప్తాను పదోన్నతిపై నియమించారు. ఈమేరకు జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి జితేంద్ర కుమార్ గురువారం ఉత్తర్వు జారీ చేశారు.
బాధ్యతల నుంచి రిలీవైన పద్మ దోర్జే
నేటి జీఆర్‌ఎంబీ సమావేశం వాయిదా
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌గా వినీత్ గుప్తాను పదోన్నతిపై నియమించారు. ఈమేరకు జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి జితేంద్ర కుమార్ గురువారం ఉత్తర్వు జారీ చేశారు. ప్రస్తుత జీఆర్‌ఎంబీ చైర్మన్ పద్మ దోర్జేను కేంద్ర జల సంఘంలోని కీలక విభాగం వాటర్ ప్లానింగ్, ప్రాజెక్టు అప్రైజల్‌కు బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు బుధవారం సాయంత్రం జీఆర్‌ఎంబీకి చేరాయి. అయితే శుక్రవారం జీఆర్‌ఎంబీ సర్వసభ్య సమావేశం తర్వాత రిలీవ్ అవ్వాలని దోర్జే భావించారు. సమావేశం మినిట్స్ తయారయ్యేందుకు కనీసం రెండు రోజులు పడుతుందని, వాటిపై దోర్జే సంతకాలు చేయాల్సి ఉందని కార్యాలయాధికారులు వివరించారు.
దీంతో దోర్జే గురువారమే రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన జీఆర్‌ఎంబీ సమావేశం వాయిదా పడింది. జీఆర్‌ఎంబీ చైర్మన్‌గా వినీత్‌గుప్త సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా.. తమ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి అనారోగ్యం కారణంగా జీఆర్‌ఎంబీ సమావేశాన్ని వచ్చే నెల రెండో వారానికి వాయిదా వేయాలని తెలంగాణ కోరింది.
సమావేశాలకు అడ్డుపడుతున్న తెలంగాణ
కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ), జీఆర్‌ఎంబీ సమావేశాలు జరగకుండా తెలంగాణ వాయిదాలు కోరడంపై ఆంధ్రప్రదేశ్ అసహనం వ్యక్తం చేసింది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశాల వాయుదాకు తెలంగాణ నీటి పారుదల శాఖ సాకులు చెబుతోందని ఏపీ జలవనరుల శాఖ వర్గాలు భావిస్తున్నాయి.
తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి గురువారం నాడు విధుల్లోనే ఉన్నారని, జలసౌధకు కూడా వచ్చారని ఏపీ జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేటాయింపులు, గణాంకాలపై చర్చించేందుకు అవకాశం లేకుండా తెలంగాణ అడ్డుపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు