Share News

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ సభ్యుడిగా వినయ్‌చంద్‌ ప్రమాణం

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:26 AM

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ సభ్యుడిగా ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన...

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ సభ్యుడిగా వినయ్‌చంద్‌ ప్రమాణం

తిరుమల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ సభ్యుడిగా ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకున్న వినయ్‌చంద్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు మాట్లాడుతూ తనపై నమ్మకముంచి టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:27 AM