Share News

వివాహితతో ప్రేమ.. బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు..

ABN , Publish Date - Apr 25 , 2026 | 08:14 PM

మహిళను ఇంటికి తీసుకురావడానికి బంధువులు ఒప్పుకోకపోవటంతో ఓ యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బ్లేడుతో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.

వివాహితతో ప్రేమ.. బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు..
Nandigama news

ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 25: వివాహితతో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మహిళను ఇంటికి తీసుకురావడానికి బంధువులు ఒప్పుకోకపోవటంతో ఆ యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బ్లేడుతో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన మస్తాన్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన వివాహిత మహిళ ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి జీవించాలని భావించారు.


ఈ నేపథ్యంలోనే మస్తాన్ ఆమెను ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి బంధువులు ఒప్పుకోలేదు. దీంతో మస్తాన్ మనస్తాపానికి గురయ్యాడు. మద్యం మత్తులో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడ్డ మస్తాన్‌ను బంధువులు నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ వీర విధ్వంసం.. ఢిల్లీపై ఘన విజయం

మహిళల ఆర్థికాభివృద్ధికి క్రమశిక్షణ, లాభదాయక వ్యాపారాలపై దృష్టి పెట్టాలి: మంత్రి సీతక్క

Updated Date - Apr 25 , 2026 | 08:18 PM