Share News

దసరా మహోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:44 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా దసరా మహోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

దసరా మహోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం

  • వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం

  • మూడు క్యూలైన్లలోనూ ఉచితంగా దర్శన ఏర్పాట్లు

  • దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

  • మంత్రుల బృందంతో అధికారుల సమావేశం

  • 25లక్షల మందికిపైగా వస్తారని అంచనా

  • రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు

విజయవాడ అర్బన్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా దసరా మహోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు 25 లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టామని వెల్లడించారు. మంగళవారందేవస్థానం సమావేశ మందిరంలో దసరా ఉత్సవాలపై మంత్రి ఆనం అధ్యక్షతన మంత్రుల బృందం అధికారులతో సమావేశమైంది. మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌, కొల్లు రవీంద్రతో పాటు పశ్చిమ శాసనసభ్యుడు యలమంచిలి సుజనా చౌదరి, దేవదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఉత్సవాలను విజయవంతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.

సామాన్య ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన వినూత్న కార్యాచరణను కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ వివరించారు. సమావేశం అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. ఈసారి రైల్వే అధికారుల సహకారంతో 7 వేల మంది సామర్థ్యంతో మూడో హోల్డింగ్‌ ఏరియాను ఏర్పాటు చేశామని, హోల్డింగ్‌ ఏరియాల్లో అన్న ప్రసాదాన్ని కూడా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. దసరా ఉత్సవాలతో పాటు సరస్‌ మేళా, విజయవాడ ఉత్సవ్‌ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 14న రాష్ట్రపతి పర్యటన, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రు లు కూడా దసరా ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రా లు సమర్పిస్తారని మంత్రి ఆనం వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 04:44 AM