పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేయండి
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:19 AM
విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పిలుపునిచ్చారు. 37 వ విజయవాడ పుస్తక మహోత్సవం 2027 జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. పుస్తక పఠనం ప్రాధాన్యం, విజ్ఞానాభివృద్ధిలో పుస్తకాల పాత్ర, సమాజంలో పఠన సంస్కృతిని విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత తదితర అంశాలపై సీఎస్ మాట్లాడారు.
ముఖ్యంగా విద్యార్థులు, యువతలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి పుస్తక మహోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పుస్తక మహోత్సవం కోఆర్డినేటర్ ఎమ్మెస్కో విజయకుమార్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు మనోహర్ నాయుడు, కార్యదర్శి లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..