Share News

11న 11.11కి పార్టీ ప్రకటన: విజయసాయి

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:25 AM

రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఈ నెల 11న 11 గంటల 11 నిమిషాలకు అవతరించనుందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడారు.

11న 11.11కి పార్టీ ప్రకటన: విజయసాయి

విజయవాడ(గాంధీనగర్‌), నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఈ నెల 11న 11 గంటల 11 నిమిషాలకు అవతరించనుందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో కేవలం రెండు కుటుంబాలు, రెండు కుల, మతాలు, రెండు పార్టీలు మాత్రమే అధికారంలో కొనసాగుతున్నాయి. హిందువైన చంద్రబాబు, క్రిస్టియన్‌ అయిన జగన్‌ మాత్రమే సీఎంలు అయ్యారు. ఈ పద్ధతికి చరమగీతం పాడి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. ప్రస్తుతం రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌లే కారణం. టీటీడీ బోర్డులో నాతో కలసి పనిచేసిన ఓవీ రమణకు పార్టీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీగా పనిచేస్తారు’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మాట్లాడుతూ... ‘జగన్‌ సమయంలో చేసిన అరాచకాలనే చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అని విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 06:27 AM