‘లిక్కర్’ కేసులో బెయిల్ పిటిషన్
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:18 AM
మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఉపసంహరించుకున్న వాసుదేవరెడ్డి
విజయవాడ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సిట్ దీనిపై కేసు నమోదు చేసిన తర్వాత అరెస్టు చేస్తుందని భావించిన ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనితోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఏసీబీ కోర్టులో ఉన్న పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీనితో ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
ఈ వార్తలనూ చదవండి: