Share News

‘ఆ సుపారీ’ ఎక్కడిదో జగన్‌కు తెలుసు: ఎమ్మెల్సీ వర్ల

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:11 AM

వైఎస్‌ జగన్‌ సొంత బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్యకు రూ.40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో జగన్‌కు తెలుసని, దానిపై ఆయన నోరువిప్పాలని ఎమ్మెల్సీ వర్ల రామయ్య కోరారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘ఆ సుపారీ’ ఎక్కడిదో జగన్‌కు తెలుసు: ఎమ్మెల్సీ వర్ల

వైఎస్‌ జగన్‌ సొంత బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్యకు రూ.40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో జగన్‌కు తెలుసని, దానిపై ఆయన నోరువిప్పాలని ఎమ్మెల్సీ వర్ల రామయ్య కోరారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వివేకానంద రెడ్డి హత్యలో సాక్షులు అందరూ అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. జగన్‌ను హైదరాబాద్‌ నుంచి పులివెందులకు తీసుకెళ్లిన డ్రైవర్‌ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ అనుమానాస్పద మరణాలపైనా సమగ్ర విచారణ జరిపితే బాబాయ్‌ హత్య సూత్రధారి ఎవరో నిగ్గు తేలుతుంది. రూ.3500 కోట్ల మద్యం కుంభకోణంలో వేళ్లన్నీ జగన్‌ వైపే చూపిస్తున్నాయి’ అని వర్ల అన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 05:11 AM