Share News

జనసేనానితో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:55 AM

జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

జనసేనానితో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిరువురి మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో పలు విషయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ చర్చించారు. పవన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలపై వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి...

అదానీ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు..

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 03:55 AM