Share News

జగన్‌కు ఉన్న రోగం ఏంటో గూగుల్ కూడా చెప్పలేకపోతోంది: అనిత

ABN , Publish Date - Feb 19 , 2026 | 08:48 PM

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉన్న రోగం ఏంటో గూగుల్ కూడా చెప్పలేకపోతోందని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ జగన్ ఒరిజినల్ హ్యాబిట్యుయల్ క్రిమినల్ అని అన్నారు.

జగన్‌కు ఉన్న రోగం ఏంటో గూగుల్ కూడా చెప్పలేకపోతోంది: అనిత
Vangalapudi Anita

అమరావతి, ఫిబ్రవరి 19: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉన్న రోగం ఏంటో గూగుల్ కూడా చెప్పలేకపోతోందని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ జగన్ ఒరిజినల్ హ్యాబిట్యుయల్ క్రిమినల్ అని అన్నారు. చెప్పిన అబద్దాన్ని పదే పదే 3 గంటలు ప్రెస్ మీట్‌లో చెప్పినందుకు గిన్నిస్ రికార్డు కూడా ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘హెరిటేజ్ సంస్థపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు’..


‘హెరిటేజ్ సంస్థ అన్ని విషయాలనూ వెబ్‌సైట్‌లో పారదర్శకంగా పెడితే వాటిని పట్టుకుని ఏదో జరిగిపోతోందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇందాపూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ కొన్ని ఉత్పత్తులు కొనుగోలు చేస్తే తప్పేంటి. హెరిటేజ్ ఇప్పటి వరకు ఏ సంస్థకూ నెయ్యి సరఫరా చేయలేదు. జగన్‌తో సావాసం చేసేసరికి బొత్సకు.. నెయ్యికి, చీజ్‌కు తేడా తెలీకుండా పోయింది. హెరిటేజ్‌పై జగన్ చెప్పింది అవాస్తవాలని బొత్సకు తెలుసు. మేం నిజాలు చెప్పినా జగన్‌కు అర్ధం కాదు. అందుకే ప్రజల ముందు అన్ని విషయాలూ బయటపెడుతున్నాం’..


‘కల్తీపై చర్చకు సిద్ధమని జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు. లడ్డూ కల్తీపై మాట్లాడలేకే సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని తెచ్చాడు. కల్తీ లడ్డూ పైనా.. హెరిటేజ్ నిరాధార ఆరోపణలపైనా అసెంబ్లీలో చర్చించటానికి మేం సిద్ధం. వైసీపీ తాలూకు చైర్మన్ కౌన్సిల్‌లో ఉండి, చర్చకు అవకాశం ఇవ్వట్లేదని జగన్ అనటం హాస్యాస్పదం. వ్యూవర్‌షిప్ అటెన్షన్ కోసం జగన్ మాట్లాడతారే తప్ప.. ఆయన దగ్గర ఏ ఆధారాలు ఉండవు. చెప్పేది వాస్తవం కాదు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

యూఏఈలో రంజాన్ క్షమాభిక్షతో 4,700 మంది ఖైదీల విడుదల

అనుమతి లేకుండా దేశం వీడి వెళ్లను.. సుప్రీంకోర్టుకు తెలిపిన అనిల్ అంబానీ..

Updated Date - Feb 19 , 2026 | 09:17 PM