Share News

విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్‌!

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:25 AM

విశాఖ నుంచి తిరుపతికి ‘వందేభారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ నడపడానికి రైల్వే శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది.

విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్‌!

  • సూత్రప్రాయంగా అంగీకరించిన రైల్వే శాఖ

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విశాఖ నుంచి తిరుపతికి ‘వందేభారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ నడపడానికి రైల్వే శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుతం విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నాలుగు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. అందులో రెండు హైదరాబాద్‌కు, ఒకటి భువనేశ్వర్‌కు, మరొకటి చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు నడుస్తున్నాయి. విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు నడపాలని చాలా కాలంగా డిమాండ్‌ ఉంది.

దానికి ఇప్పటికి ఆమోదం లభించింది. అయితే ఇంకా దీనిపై రైల్వే శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం విశాఖ నుంచి తిరుపతికి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు 14.10 గంటల సమయం పడుతోంది. వందేభారత్‌ అందుబాటులోకి వస్తే 8.35 గంటల్లో చేరుకోవచ్చు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 05:31 AM