‘అర్నబ్’ మిగిల్చిన కష్టం!
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:15 AM
ఇటీవల తీవ్ర ప్రభావం చూపిన అర్నబ్ తుఫాను కాకినాడ జిల్లా ఉప్పాడ శివారు సుబ్బంపేట గ్రామస్తులకు కొత్త కష్టాలు తెచ్చింది.
ధ్వంసమైన ఉప్పాడ బీచ్‌రోడ్డుపైనే అంత్యక్రియలు
కొత్తపల్లి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఇటీవల తీవ్ర ప్రభావం చూపిన అర్నబ్ తుఫాను కాకినాడ జిల్లా ఉప్పాడ శివారు సుబ్బంపేట గ్రామస్తులకు కొత్త కష్టాలు తెచ్చింది. గ్రామానికి చెందిన మహిళ బొందు దానాయమ్మ(80) బుధవారం మృతిచెందింది. ఈ గ్రామానికి శ్మశానవాటిక లేకపోవడంతో గతంలో బీచ్‌రోడ్డు పక్కన దహనసంస్కాలు నిర్వహించేవారు. అయితే అర్నబ్‌తో ఉప్పాడ బీచ్‌రోడ్డు ధ్వంసమైంది. బీచ్‌రోడ్డు పక్కన దహససంస్కారాలు చేసుకునే ప్రాంతంలో విరిగిన రోడ్డు ముక్కలు పేరుకుపోవడంతో దానాయమ్మ అంతిమ సంస్కారాలు బీచ్‌రోడ్డు మధ్యలో చేయాల్సి వచ్చింది.
ఎన్నో ఏళ్లుగా సుబ్బంపేట, కొత్తపట్నం, పల్లిపేట గ్రామాల ప్రజలకు శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితంలేకుండా పోయింది. కనీసం ఆఖరి మజలీలో అయినా ప్రశాంతం గా అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన స్థలం మంజూరు చేయలేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ గ్రామాలకు శ్మశాన వాటిక కేటాయించాలని, లేనిపక్షంలో ఎవరైనా మరణిస్తే బీచ్‌రోడ్డుపైనే అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్