అన్ని విధాలా సహకరిస్తాం: అమిత్ షా భరోసా
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:30 AM
అర్నబ్ తుఫాన్ బాధిత రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అండగా ఉంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రులతో అమిత్ షా మాట్లాడారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ బాధిత రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అండగా ఉంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
విపత్తు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని అన్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే ఐఎంసీటీ బృందాలను పంపుతామని స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు