రోడ్డుకు అటూ.. ఇటూ!
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:31 AM
రోడ్డుకు అటూ ఇటూ ఇళ్లున్నాయి. చూడ్డానికి అదంతా ఒకే ఊరులా కనిపిస్తుంది.. కానీ రోడ్డుకు ఓ వైపున ఉన్నది ఒక జిల్లా కాగా, మరో వైపు ఉన్నది మరో జిల్లా
రెండు గ్రామాలు.. రెండు మండలాలు.. రెండు జిల్లాలు!
వేర్వేరు తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
చాగలమర్రి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రోడ్డుకు అటూ ఇటూ ఇళ్లున్నాయి. చూడ్డానికి అదంతా ఒకే ఊరులా కనిపిస్తుంది.. కానీ రోడ్డుకు ఓ వైపున ఉన్నది ఒక జిల్లా కాగా, మరో వైపు ఉన్నది మరో జిల్లా..! కేవలం ఈ రోడ్డే ఈ రెండింటికీ సరిహద్దు.. ఇదీ.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని జ్ఞానాపురం... కడప జిల్లాకు చెందిన నారాయణపల్లె ప్రత్యేకత!. జ్ఞానాపురంలో 230 మంది, నారాయణపల్లెలో 1,100 మంది జనాభా ఉన్నారు. రెండు జిల్లాల పరిధి కావడంతో ఎన్నికల షెడ్యూల్లో భాగంగా.. ఈ రెండు గ్రామాలకు రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జ్ఞానాపురంలో మొదటి విడత 26న, నారాయణపల్లెలో 3వ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే తాము రెండు జిల్లాలు, రెండు మండలాలు, రెండు గ్రామాల పరిధిలో ఉన్నామని గుర్తుకు వస్తుందని ఇక్కడి ప్రజలు చెప్పడం విశేషం.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్