డీజే హోరుకు ఆగిన మరో గుండె!
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:25 AM
తాడేపల్లిగూడెం రూరల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జనోత్సంలో అపశ్రుతి చోటుచేసుకుంది. విశాఖ జీవీఎంసీ 8వ వార్డు ఎండాడ బీసీ కాలనీలో శనివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం నిర్వహించారు.
విశాఖలో వృద్ధుడు కన్నుమూత
వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి
ఎండాడ (విశాఖపట్నం), తాడేపల్లిగూడెం రూరల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జనోత్సంలో అపశ్రుతి చోటుచేసుకుంది. విశాఖ జీవీఎంసీ 8వ వార్డు ఎండాడ బీసీ కాలనీలో శనివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే సౌండ్స్ పాటలతో ఊరేగింపు సాగుతుండగా అదే ప్రాంతానికి చెందిన రెడ్డిపల్లి శంకరరావు (62) ఇంట్లో నుంచి బయటకు వచ్చి తిలకిస్తున్నారు. ఆ డీజే శబ్దాలకు గుండె అదిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.
డీజే ముందు డ్యాన్స్ చేస్తూ...
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారంలో కాకర్లమూడి ఏసు (48) శనివారం రాత్రి జరిగిన చవితి ఊరేగింపు వేడుకల్లో డీజే ముందు స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని, గుండెపోటుగా వైద్యులు నిర్థారించారు. ఏసు తాడేపల్లిగూడెంలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి..