కుందేళ్ల వేటకు వెళ్లి...
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:18 AM
పంటల రక్షణ కోసం పొలాలకు వేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు స్నేహితులు మృతిచెందారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
మైలవరం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పంటల రక్షణ కోసం పొలాలకు వేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామానికి చెందిన రామ్చరణ్ (20), నంద్యాల జిల్లా కలుగొట్ల గ్రామానికి చెందిన జంబులయ్య (22) ఇద్దరూ స్నేహితులు. జంబులయ్య కొన్ని సంవత్సరాలుగా తలమంచిపట్నంలోనే నివాసం ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి శనివారం రాత్రి కోన అనంతపురం గ్రామం వద్ద కొండ వద్దకు కుందేళ్ల వేటకు వెళ్లారు.
అక్కడి రైతులు పంటను పందుల బెడద నుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ కరెంటు తీగలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది గమనించని ఆ ఇద్దరు యువకులు ఆ వైర్లను తగులుకుని విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ కుళాయప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!