సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:21 AM
స్నేహితుల విహారయాత్ర విషాదంగా మారింది. సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులు...
ఎచ్చెర్ల, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): స్నేహితుల విహారయాత్ర విషాదంగా మారింది. సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులు ఏడుగురు సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం పుక్కళ్లపేట ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్దకు వెళ్లారు. ముగ్గురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు.
వారిలో పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన జి.మణికంఠ, విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన జి.మనోజ్ గల్లంతయ్యారు. మరో విద్యార్థి అల్లు లిఖిత్ తోటి విద్యార్థుల సాయంతో ఒడ్డుకు చేరుకోగలిగాడు. కళింగపట్నం మెరైన్ సీఐ బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రివరకు కూడా వారి అచూకీ లభ్యం కాలేదు.
ఈ వార్తలనూ చదవండి: