Share News

రోడ్డుకు అటో జిల్లా.. ఇటో జిల్లా!

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:53 AM

ఒకటే రోడ్డు.. దాని ఇరువైపులా రెండు గ్రామాలు! అవి కూడా రెండు జిల్లాల్లోని రెండు వేర్వేరు మండలాలకు చెందినవి!! వీటిల్లో రోడ్డుకు ఒకవైపు ఉండే వి.రావిగుంట అనే గ్రామం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోది కాగా,...

రోడ్డుకు అటో జిల్లా.. ఇటో జిల్లా!

  • ప్రత్యేకతను సంతరించుకున్న జంట రావిగుంటలు

ముదినేపల్లి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఒకటే రోడ్డు.. దాని ఇరువైపులా రెండు గ్రామాలు! అవి కూడా రెండు జిల్లాల్లోని రెండు వేర్వేరు మండలాలకు చెందినవి!! వీటిల్లో రోడ్డుకు ఒకవైపు ఉండే వి.రావిగుంట అనే గ్రామం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోది కాగా, రోడ్డుకు మరోవైపు ఉండే టి.రావిగుంట కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో ఉండటం విశేషం.

వీటిని జంట రావిగుంటలని కూడా పిలుస్తారు. స్థానిక ఎన్నికల్లో ఈ పంచాయతీల సర్పంచ్‌ పదవులు మహిళలకే రిజర్వ్‌ అయ్యాయి. వి.రావిగుంటలో ఎస్సీ మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వగా.. టి.రావిగుంట పంచాయతీ సర్పంచ్‌ పదవి ఓసీ మహిళలకు రిజర్వ్‌ అయింది. టి.రావిగుంటలో 29న, వి.రావిగుంటలో డిసెంబరు 2న పోలింగ్‌ జరుగనుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 04:55 AM