Share News

యాచకురాలి ఔదార్యం.. ఆలయాలకు విరాళం

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:39 AM

ఆమె యాచకురాలు.. అయితేనేం! ఆలయాల వద్ద భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ములో కొంత పొదుపు చేస్తూ, అదే ఆలయాల అభివృద్ధికి విరాళంగా అందిస్తున్నారు.

యాచకురాలి ఔదార్యం.. ఆలయాలకు విరాళం

  • భిక్షాటన సొమ్ములో తాజాగా రూ.50వేలు సమర్పణ

తుని రూరల్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆమె యాచకురాలు.. అయితేనేం! ఆలయాల వద్ద భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ములో కొంత పొదుపు చేస్తూ, అదే ఆలయాల అభివృద్ధికి విరాళంగా అందిస్తున్నారు. ఆమే.. తునికి చెందిన యాచకురాలు నర్సియమ్మ. కార్తీకమాసం సందర్భంగా కాకినాడ జిల్లా తుని గాంధీ సత్రం ప్రాంగణంలోని అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయానికి శనివారం ఆమె రూ.50వేల విరాళం అందించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెను సత్కరించారు. కాగా, నర్సియ్యమ్మ ఇప్పటివరకు ధారాలమ్మ ఆలయానికి రూ.లక్ష, శివాలయానికి రూ.50వేలు ఇవ్వడంతో పాటు శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి ‘బంగారు కళ్లు’ సమర్పించారు. ఇతర ఆలయాలకు కూడా రూ.10వేలు, రూ.20వేల చొప్పున విరాళాలు అందించారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 07:41 AM