Share News

27న వైకుంఠద్వార దర్శన కోటా విడుదల?

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:41 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించిన టోకెన్ల ఈ-డిప్‌ కోటాను ఈ నెల 27న ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.

27న వైకుంఠద్వార దర్శన కోటా విడుదల?

  • సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న టీటీడీ ఉన్నతాధికారులు

తిరుమల, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించిన టోకెన్ల ఈ-డిప్‌ కోటాను ఈ నెల 27న ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. డిసెంబరు 20 నుంచి 29 వరకు పదిరోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో తొలి రెండురోజులకు సంబంధించి దాదాపు 1.60 లక్షల టోకెన్లను నవంబరు 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పించి ఆ తర్వాత డిప్‌ ద్వారా టోకెన్లు కేటాయించే అంశంపై టీటీడీ కసరత్తు చేస్తోంది.

అలాగే డిసెంబరు 22 నుంచి 29వ తేదీ వరకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 దర్శన టికెట్లు కూడా కేటాయించనున్నారు. మొదటి రెండురోజులు మినహాయిస్తే మిగిలిన ఎనిమిది రోజులు ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేకపోయినా తిరుమలకు వచ్చే భక్తులందరికి వైకుంఠద్వార దర్శనం కల్పించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 10 రోజుల్లో 8.34 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాటు చేశారు. టోకెన్లు, టికెట్ల విడుదల తేదీలు దాదాపుగా ఖరారైనప్పటికీ స్వర్ణాభరణాల విరాళ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చే సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 05:42 AM