Share News

నేటి నుంచి తిరుమల వైకుంఠద్వార దర్శన టికెట్లు

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:04 AM

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్లు, టోకెన్ల కోటాను టీటీడీ శనివారం నుంచి విడుదల చేయనుంది. డిసెంబరు 20 నుంచి 29 వరకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి.

నేటి నుంచి తిరుమల వైకుంఠద్వార దర్శన టికెట్లు

తిరుమల, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్లు, టోకెన్ల కోటాను టీటీడీ శనివారం నుంచి విడుదల చేయనుంది. డిసెంబరు 20 నుంచి 29 వరకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, 30వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారు. వైకుంఠం ఏకాదశి, ద్వాదశి రోజులకు సంబంధించిన స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లు టీటీడీ ఈ-డిప్‌ ద్వారా కేటాయించనుంది. 20, 21 తేదీలకు టోకెన్ల కోసం డిసెంబరు 1 నుంచి 5 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:06 AM