Share News

టీటీడీకి ఐసీఏఐ సాయం

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:39 AM

టీటీడీ అకౌంటింగ్‌ విధానాన్ని ఆధునికీకరించడంతో పాటు దాని ఆస్తులను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) సహాయం చేస్తోంది.

టీటీడీకి ఐసీఏఐ సాయం

తిరుపతి(టీటీడీ), సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): టీటీడీ అకౌంటింగ్‌ విధానాన్ని ఆధునికీకరించడంతో పాటు దాని ఆస్తులను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) సహాయం చేస్తోంది. స్వామివారికి భక్తులు కానుకగా ఇచ్చిన భూములను రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌ఈఐటీ)ల ద్వారా నగదు రూపంలోకి మార్చేందుకు మార్గదర్శకాలను అందిస్తోంది. టీటీడీ వద్ద ఉన్న భారీ బంగారు నిల్వలను కచ్చితంగా ధ్రువీకరించేందుకు, వాటి విలువను లెక్కించేందుకు సహాయం చేస్తోంది. మూడు దశాబ్దాల నాటి లెక్కల విధానాన్ని ప్రస్తుతం టీటీడీ వినియోగిస్తోందని ఐసీఏఐ అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌ తెలిపారు. కొచ్చిలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సరికొత్త అకౌంటింగ్‌ మాన్యువల్‌ను ఐసీఏఐ సిద్ధం చేస్తోందని, ఇది దాదాపు పూర్తి కావచ్చిందని అన్నారు. ఈ కొత్త విధానాలపై టీటీడీ సిబ్బందికి అవగాహన, సామర్థ్య పెంపు శిక్షణ సైతం ఐసీఏఐ ఇవ్వనుందని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 05:39 AM