నేడు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:36 AM
తిరుమలలో బుధవారం సాయంత్రం టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం జరగనుంది.
వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చ
తిరుమల, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుమలలో బుధవారం సాయంత్రం టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం జరగనుంది. బీఆర్ నాయుడు చైర్మన్‌గా ఏర్పాటైన ధర్మకర్తల మండలి పదవీకాలం గత నెలలో పూర్తికావడంతో టీటీడీ ఈవో రవిచంద్ర చైర్మన్‌గా స్పెసిఫైడ్ అథారిటీని రాష్ట్రప్రభుత్వం నియమించింది. డిసెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు.. స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, సభ్యులు, జేఈవోలు, వివిధ విభాగాల అధికారులు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సమావేశం కానున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు