Share News

సేవ, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:44 AM

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు.

 సేవ, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం

  • టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌ రవిచంద్ర.. బాధ్యతల స్వీకరణ

తిరుమల, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. దేవుని సేవ చేసేందుకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న ఇతర 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వెల్లడించారు. టీటీడీ నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలలకు వచ్చే రోగులకు ఆధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 04:44 AM