Share News

కర్ణాటక సత్రాలపై నిర్ణయాలు మా దృష్టికి తీసుకురండి

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:46 AM

తిరుమలలోని కర్ణాటక సత్రాల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు టీటీడీ దృష్టికి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు.

కర్ణాటక సత్రాలపై నిర్ణయాలు మా దృష్టికి తీసుకురండి

  • మిగిలిన మఠాల తరహాలోనే మీరూ లీజు చెల్లించాలి

  • కర్ణాటక ఎండోమెంట్‌ కమిషనర్‌కు టీటీడీ అదనపు ఈవో సూచన

తిరుమల, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని కర్ణాటక సత్రాల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు టీటీడీ దృష్టికి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఆ రాష్ట్ర ఎండోమెంట్‌ కమిషనర్‌ శరత్‌, తిరుమలలోని కర్ణాటక సత్రాల అధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో ప్రధానంగా లీజ్‌ అగ్రిమెంట్‌, అద్దె చెల్లింపులపై చర్చించారు. తిరుమలలోని ఇతర మఠాల తరాహాలో లీజ్‌ ధర చెల్లించాలని స్పష్టంచేశారు.

అలాగే ఆ సత్రాల్లోని గదులను కేవలం కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులకు మాత్రమే కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయని, అన్ని ప్రాంతాల భక్తులకూ గదులు కేటాయించాలన్నారు. ఇక, ఈ అంశాలపై ఆ రాష్ట్ర అధికారులు స్పందిస్తూ మైసూరు మహారాజు దేవస్థానం అభివృద్ధికి అందించిన సేవలు, విరాళాల నేపథ్యంలో తమకు ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నాయని, నూతన నిర్ణయాలపై తమ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని బదులిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 04:48 AM