వైసీపీ నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:16 AM
వైసీపీ నాయకుడి వేధింపులు తట్టుకోలేక తిరువూరు మునిసిపల్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి షేక్ బాజీ(34) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి సలీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు
తిరువూరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడి వేధింపులు తట్టుకోలేక తిరువూరు మునిసిపల్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి షేక్ బాజీ(34) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి సలీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మునిసిపాలిటీలో షేక్ బాజీ బోర్ల మరమ్మతు పనులు చేస్తుంటాడు. ఐదేళ్ల కిందట వైసీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ చిట్టిపోతుల లక్ష్మీనారాయణ వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. దీనిపై ప్రతినెలా కొంత నగదు ఆయనకు చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే, మొత్తం బాకీ తీర్చిన తర్వాత కూడా అతడి వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు పెట్టుకుని అదనంగా నగదు ఇవ్వకపోతే రూ.10 లక్షలు చెల్లించాలని కేసు వేస్తానని బెదిరించాడని, ఆ భయంతో తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాజీ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శాతకర్ణి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్