Share News

ప్రపంచస్థాయి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా తిరుపతి

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:29 AM

తిరుపతిని ప్రపంచస్థాయి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేసే అవకాశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ సీఈవో.. ఎక్సైజ్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

 ప్రపంచస్థాయి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా తిరుపతి

  • తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తిరుపతిని ప్రపంచస్థాయి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేసే అవకాశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ సీఈవో.. ఎక్సైజ్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. తిరుపతి కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ భాగస్వాముల సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ ఆర్ధికాభివృద్ధికి అవసరమైన సుమారు 50 నుంచి 60 కీలక ప్రాజెక్టులు రావడానికి రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు. అందుకు అవసరమైన భూమి, పెట్టుబడులు, నిధలు, వనరులను ముందుగానే అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.

ప్రజాభాగస్వామ్యంతో ఈ ప్రక్రియ నిర్వహించి స్థానిక అవసరాలను ప్రణాళికలో భాగం చేస్తామన్నారు. పీపీపీ విధానంలో పెట్టుబడులను సమీకరించడంతో పాటు నిపుణుల సహకారం తీసుకుంటామని తెలిపారు. తిరుపతి సిటీ ఎకనామిక్‌ రీజియన్‌లో 44 తయారీ సంస్థలు, 14 జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలతో పాటు స్పేస్‌సిటీ ఉండడం వరమని ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:29 AM