Share News

భక్తుల మనోభావాలకు అనుగుణంగానే అభయాంజనేయస్వామి ఆలయ మార్పు

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:13 AM

భక్తుల మనోభావాలకు అనుగుణంగానే రేణిగుంట సమీపంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయ మార్పు చేపట్టామని తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

భక్తుల మనోభావాలకు అనుగుణంగానే అభయాంజనేయస్వామి ఆలయ మార్పు

  • తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), నవంబరు 25(ఆంధ్రజ్యోతి): భక్తుల మనోభావాలకు అనుగుణంగానే రేణిగుంట సమీపంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయ మార్పు చేపట్టామని తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఆలయ మార్పునకు సంబంధించిన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. అంతేకాదు, వైసీపీ హయాంలో నిర్ణయించిన మేరకు అలైన్‌మెంటు పనులు జరుగుతున్నాయన్నారు. కడప-రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ నేపథ్యంలో రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలో అభయ ఆంజనేయ ఆలయాన్ని తొలగించా రు. ఆలయం తొలగింపు వెనుక ఏం జరిగిందన్న వాస్తవాలు పక్కన పెట్ట్టి వైసీపీ నేతలు అసత్య ప్రచారాలతో సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం ఆంజనేయపురం గ్రామస్థులు, ఆలయ అర్చకుడితో కలిసి కలెక్టర్‌ మీడియాతో మాట్లాడారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 05:15 AM