Share News

16 నుంచి భక్తులకు అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:07 AM

దాదాపు రూ.వంద కోట్లకుపైగా విరాళాలతో అత్యాధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో ఆధునికీకరించిన తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఈ నెల 16వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.

16 నుంచి భక్తులకు అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం

తిరుమల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): దాదాపు రూ.వంద కోట్లకుపైగా విరాళాలతో అత్యాధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో ఆధునికీకరించిన తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఈ నెల 16వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. దాదాపు ఆరేళ్లకుపైగా భక్తులకు దూరమైన ఎస్వీ మ్యూజియం తిరిగి భక్తుల సందర్శనకు సిద్ధమైంది. ట్రయల్‌ రన్‌లో భాగంగా 15 వరకు టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, టీటీడీ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, శ్రీవారి సేవకులను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ట్రయల్‌ రన్‌ పూర్తికాగానే నవంబరు 16వ తేదీ నుంచి భక్తులందరికీ ప్రవేశం ఉంటుందని వెల్లడించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 06:07 AM