సర్వదర్శనానికి 18 గంటలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:34 AM
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులతో పాటు తమిళులకు పవిత్రమైన పెరటాశి మూడో శనివారం సమీపిస్తున్న క్రమంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నానికే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ ఆక్టోపస్ భవనం వరకు వ్యాపించింది. సాయంత్రం వరకు సర్వదర్శన క్యూలైన్ ప్రవేశాన్ని మూసివేశారు. క్యూలైన్‌లోని భక్తులందరూ షెడ్లు, కంపార్టుమెంట్లలోకి చేరుకున్న తర్వాత తిరిగి వెలుపల ఉన్న భక్తులను క్యూలైన్‌లోకి అనుమతించారు. క్యూలోకి ప్రవేశించిన భక్తులకు దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. ఇక, టైంస్లాట్ టోకెన్లు, టికెట్లు ఉన్న వారికి దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది. గదులు కేటాయించే కౌంటర్లు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, ఆలయ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం