Share News

గజ వాహనంపై మలయప్ప అభయం

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:04 AM

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి గజవాహనంపై గోవిందుడు దర్శనమిచ్చారు.

గజ వాహనంపై మలయప్ప అభయం

  • పుష్పక విమానంలో గోవర్ధన గిరిధారిగా చిద్విలాసం

తిరుమల, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి గజవాహనంపై గోవిందుడు దర్శనమిచ్చారు. జోరువర్షంలో ఘటాటోపం నీడలో కరుణించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభంకాగా.. వర్షంలో తడుస్తూనే స్వామి రాక కోసం ఎదురుచూస్తున్న భక్తుల వద్దకు శ్రీవారిని తీసుకెళ్లి దర్శనం చేయించారు. అంతకుముందు సాయంత్రం 4 గంటల మధ్య పుష్పక విమానంలో గోవర్థనగిరిధారి కృష్ణుడి అలంకారంలో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం హనుమంత వాహనంపై కోదండరాముడి అలంకారంలో మలయప్పస్వామి అనుగ్రహించారు.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 04:59 AM