Share News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు, పెరటాశి మాసం నేపథ్యంలో మూడురోజులుగా తిరుమల రద్దీతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

  • సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమల, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు, పెరటాశి మాసం నేపథ్యంలో మూడురోజులుగా తిరుమల రద్దీతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో బుధ, గురువారాల తరహాలో శుక్రవారం కూడా తిరుమలలో రద్దీ కొనసాగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపారుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శన భక్తులు పాచికాల్వ గంగమ్మ ఆలయం సర్కిల్‌ నుంచి సర్వదర్శన క్యూలోకి ప్రవేశిస్తున్నారు. క్యూలైన్‌లో భక్తులు ఇబ్బంది పడకుండా భక్తులను దఫాల వారీగా అనుమతిస్తున్నారు. క్యూలైన్లు నిండిన వెంటనే ప్రవేశమార్గాన్ని మూసివేస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లో కూడా రద్దీ కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో టీటీడీ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది.

  • శ్రీవాణి దర్శన టికెట్ల కోటా రద్దు

రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీవాణి దర్శన టికెట్ల శని, ఆదివారాల ఆన్‌లైన్‌ కరెంట్‌ బుకింగ్‌ కోటాను టీటీడీ రద్దు చేసింది. రోజూ ఉదయం టీటీడీ కరెంట్‌ బుకింగ్‌ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

  • ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.1.02 కోట్ల విరాళం

టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు శుక్రవారం రూ.1.02 కోట్ల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన నోముల అశోక్‌కుమార్‌ ఈ విరాళాన్ని ఇచ్చారు. ఈమేరకు చెక్‌ను హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు దాత అందజేశారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 04:57 AM